Seeds : విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు..!
Seeds : విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు..!
గుర్రంపోడు, మనసాక్షి :
నకిలీ విత్తనాలను విక్రయించిన ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని గుర్రంపోడు ఎస్సై పసుపులేటి మధు అన్నారు. మంగళవారం ఆయన మండల వ్యవసాయ అధికారి మాధవ రెడ్డితో కలిసి గుర్రంపోడు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఫర్టిలైజర్ దుకాణదారులు ప్రభుత్వం ద్వారా నిర్ధారించబడిన ప్రముఖ కంపెనీల పత్తి విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.రైతులు ఆరుగాలం కష్టపడి ఎంతో శ్రమించి పత్తి పంటను సాగు చేస్తారని అన్నారు.
వారు ఫర్టిలైజర్ దుకాణ దారులపై నమ్మకంతో విత్తనాలు కొనుగోలు చేసి ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశించి వ్యవసాయం చేస్తారని అలాంటి రైతులను మోసగించే విధంగా నకిలీ విత్తనాలను ఏ దుకాణా దారుడు విక్రయించవద్దని అలా విక్రయించిన విత్తనాలు నకిలీవని తేలినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు సైదులు,విక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!
-
Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!
-
District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!
-
Rainy Season : వర్షాకాలంలో బ్యాటరీలు సరిగ్గా పని చేయవు ఎందుకు..!









