పోలీస్ పహారా లేకుండా తిరిగే ధైర్యం రసామయి కి లేదా..!
పోలీస్ పహారా లేకుండా తిరిగే ధైర్యం రసామయి కి లేదా..!
మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంతగరి వినయ్ కుమార్
ఇల్లంతకుంట,సెప్టెంబర్ 23, మన సాక్షి:
నియోజకవర్గానికి కోత్త బిచ్చగాల్లు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని మానకోండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ అన్నారు. శనివారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి స్థానికేతర శాసనసభ్యుడు రసామయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
అభివృద్ది చేసి ఉంటే పోలీస్ పహారా లేకుండా మండలంలో తిరిగే ధైర్యం లేదా అనిప్రశ్నించారు. ఎందుకు ఓటు వేయాలి దళిత సోదరులను దళిత బంద్ పేరిట మరోసారి మోసం చేస్తునందుకు మిమ్మల్ని నమ్మి ఓటు వేయ్యాలా..? లేదా ..?డబల్ బెడ్రూం ఇవ్వనందుకా ఓటు వేయ్యాలా నిరుద్యోగులకు భృతి ఇవ్వనందుకు ఓటు వేయ్యాలా అరుంధతి ఫంక్షన్ హాల్ కట్టనందుకు ఓటు వేయ్యాలా లేదా పనుల పేరిట కమీషన్లు తీసుకున్నందుకు ఓటు వేయ్యాలా అని అన్నారు.
ALSO READ : తాను చనిపోతూ.. ఏడుగురికి ప్రాణం పోసిన పెంటయ్య..!
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తాం చేసేది మాత్రమే చేప్తాం ప్రజలందరు ఆలోచిస్తున్నారు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దుతుగా ఉన్నరాని భయంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రంలో సీనియర్ నాయకులు పసుల వెంకటి, పట్టణ అధ్యక్షుడు మామడి నరేష్, ఫీషరిస్ చైర్మన్ జెట్టి మల్లేశం, సాయి వర్మ, ప్రదాన కార్యదర్శి కాసుపాక రమేష్, పల్లే శేఖర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ALSO READ :









