తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Badi Bata : ముందస్తు బడిబాట.. ఉపాధ్యాయులు, విద్యార్థుల ర్యాలీ..!

Badi Bata : ముందస్తు బడిబాట.. ఉపాధ్యాయులు, విద్యార్థుల ర్యాలీ..!

నడిగూడెం, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల ఆధ్వర్యంలో ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు రావాలని కోరినారు.

ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనం లో వారానికి మూడుసార్లు గుడ్డు మరియు రాగి జావ వడ్డిస్తారు కావున విద్యార్థిని విద్యార్థులను మా పాఠశాలలో చేర్పించమని బోధించే అందరూ ఉపాధ్యాయులను విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు పరిచయం చేసి అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి శారద, ఎం పుల్లయ్య ఉపాధ్యాయులు ఎం.వి చారి, నారాయణ, నరేంద్ర, రజిని, కృష్ణవేణి, కరుణ, కరుణాకర్, ప్రమీల సిఆర్పి నందిగామ రామారావ్ తల్లిదండ్రులు పోలంపల్లి బుచ్చయ్య, బండారు శోభారాణి, మండవ నాగమణి, మట్టపల్లి, మోలుగూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  2. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  3. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

  4. UPI : యూపీఐ లావాదేవీలపై జిఎస్టి విధింపు పై కేంద్రం క్లారిటీ..!

  5. Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

మరిన్ని వార్తలు