రాహుల్ సభ ఏర్పాట్లలో అపశ్రుతి

రాహుల్ సభ ఏర్పాట్లలో అపశ్రుతి

రెండు జనరేటర్లు, రెండు డిసిఎం వాహనాలు దగ్ధం.

కొత్తూరు పేపరోస్పోర్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, అక్టోబర్ 30, మనసాక్షి : షాద్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న రాహుల్ గాంధీ జోడయాత్ర పర్యటన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కొత్తూరు మండల కేంద్రంలోని  ఆదివారం పేపరోస్పోర్ట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 125 కేవీ, 62 కెవి జనరేటర్లు దగ్ధం అయ్యాయి. అదేవిధంగా రెండు డీసీఎం వాహనాలు కూడా అగ్నికి ఆహుతైనట్లు మహేశ్వరం అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ తెలిపారు. సాంకేతిక కారణాల లోపంతో జరిగిన విద్యుత్ షాక్ తో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు.

అయితే రాహుల్ గాంధీ ఏర్పాట్ల కోసం జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈ అపశృతి చోటు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగిన స్థానిక పోలీసులు స్పందించలేదు. బందోబస్తు అంతంత మాత్రంగానే ఉండడంతో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి 100 డయల్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రమే వచ్చారు. ఉన్నతాధికారులు ఎవరు సంఘటన స్థలానికి రాలేదు.