Ponguleti : పర్యాటక ప్రాంతంగా రామదాసు ధ్యాన మందిరం.. మంత్రి పొంగులేటి..!
Ponguleti : పర్యాటక ప్రాంతంగా రామదాసు ధ్యాన మందిరం.. మంత్రి పొంగులేటి..!
నేలకొండపల్లి, మన సాక్షి:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరం ప్రాంతాన్ని పర్యాటక స్థలం గా అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యమని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మండల కేంద్రంలో రామదాసు ధ్యాన మందిరంలో రూ.2.50 కోట్ల తో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ను బుధవారం మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదాసు కాంస్య విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు…. బౌద్ధక్షేత్రం, రామదాసు మందిరం ఉన్న ఈ ప్రాంతం పర్యాటక ప్లేస్ గా అభివృద్ధి చేందాలని అన్నారు. -రామదాసు స్థలంలో ఉంటే ప్రశాంతత కనిపిస్తుందని అన్నారు. ధ్యాన మందిరం ను ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులతో చర్చించి అందుకు.తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ALSO READ : కలెక్టర్ సారూ.. జర ఇటు సూడరూ.. చెట్లు ఎందుకు నరికారో..!
రాములోరి కోసం రామదాసు పడ్డ కష్టాలు, ఇబ్బందులు తెలుసు అన్నారు. రాష్ట్రంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇందిరమ్మ రాజ్యం లో పేదోళ్ల కు న్యాయం చేస్తామని అన్నారు. చెప్పిన ప్రతీ మాట ను నెరవేరుస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తామని అన్నారు.
భక్తరామదాసు ప్రభుత్వం కు ఆదర్శమని పేర్కోన్నారు. ప్రజలు కోరిక మేరకు మందిరం చుట్టూ ప్రహారీ తో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా చూస్తామని అన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలం లోని రాయగూడెం వద్ద నున్న చెరువుమాధారం ఎత్తిపోతుల పధకం ను సందర్శించి నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్‌బాబు, కాంగ్రెస్ నాయకులు వజ్జా రమ్య, స్వర్ణకుమారి, శాఖమూరి రమేష్, వెనికె జానకిరామయ్య, బచ్చలకూరి నాగరాజు, భద్రయ్య, బొందయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ,
రాయపూడి నవీన్, కడియాల నరేష్, వంగవీటి నాగేశ్వరరావు, గరిడేపల్లి రామారావు, నల్లాని మల్లిఖార్జున్‌రావు, వేగినాటి లక్ష్మీనర్సయ్య, సీతారాములు, ఈవూరి శ్రీనివాసరెడ్డి, మైశా శంకర్. అక్కం ఏడుకొండలు, పొన్నగాని రాంభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
LATEST NEWS :
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!
Suryapet : సూర్యాపేటలో మృతదేహాల కలకలం..!









