Miryalaguda : ఆయకట్టులో కూలీల కొరత.. జోరుగా వరినాట్లు..!
Miryalaguda : ఆయకట్టులో కూలీల కొరత.. జోరుగా వరినాట్లు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో జోరుగా వరి నాట్లు సాగుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురియడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆగస్టు 2వ తేదీన సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు.
దాంతో నాటి నుంచి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పటికే వరి నార్లు పోసుకున్న రైతులు నీటి రాక వల్ల వరి నాట్లు వేస్తున్నారు.
సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా సాగునీరు అందనుంది. 4.3 లక్షల ఎకరాలకు ఎడమ కాలువ నీరు ఈ రెండు జిల్లాల పరిధిలో అందుంతుంది. దాంతో రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు.
ALSO READ : మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!
వరినాట్ల సీజన్ కావడం వల్ల రైతులకు నాటు కూలీల కొరత ఏర్పడింది. ఆయకట్టు పరిధిలో ఒకేసారి నాట్లు వేయడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. నాట్లు వేసే మహిళలకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా మహిళ నాటుకూలి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున గతంలో ఇచ్చేవారు.
కానీ డిమాండ్ పెరగడంతో ఒక్కొక్క మహిళా కూలికి 700 నుంచి 800 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అయినా కూడా కూలీలు దొరకడం లేదు. రైతులు నానా ఇబ్బందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది.
నీటి విడుదల చేశాకనే నార్లు పోసుకున్న రైతులు :
నాగార్జునసాగర్ ఎడమకాలు ఆయకట్టు పరిధిలో కొన్ని ప్రాంతాలలో రైతులు సాగర్ నీటిని విడుదల చేశాకనే వరినార్లు పోసుకున్నారు. కొన్నిచోట్ల అంతకు ముందే వర్షాలకు నార్లు పోసుకోగా మరి కొంత మంది బోరుబావుల కింద నార్లు పోసుకున్నారు. కానీ కొన్నిచోట్ల నీటిని విడుదల చేశాకనే రైతులు నార్లు పోసుకున్నారు. ముందస్తుగా నార్లు పోసుకున్న రైతులు ప్రస్తుతం వారి నాట్లు వేస్తున్నారు.









