క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!

Hyderabad : ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..!

హైదరాబాద్, మన సాక్షి :

ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కలకలం రేపుతుంది. వివరాల ప్రకారం ఈనెల 18న ట్రావెల్స్ బస్సులో అమ్మాయిలపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18వ తేదీన కుకట్ పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది.

రాత్రి సమయంలో బస్సు ప్రయాణంలో ఉన్న ఆ మహిళ నిద్రలో ఉంది. ఆ సమయంలో మెల్లగా పక్కకు చేరిన యువకుడు అరిస్తే చంపేస్తాను అంటూ బలవంతంగా అత్యాచారంకు పాల్పడ్డాడు. తనపై జరిగిన ఘటన ఆమె ఇంటికి వెళ్ళాక భర్తకు చెప్పింది. కాగా వారిద్దరూ ఆదివారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కూకట్ పల్లికి కేసు బదిలీ చేశారు. అయితే ట్రావెల్స్ బస్సులో బుకింగ్ చేసుకున్న వారి ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు