TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమం

Ration Cards : రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త..!

తెలంగాణలో రేషన్ కార్డుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు.

Ration Cards : రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త..!

మన సాక్షి :

తెలంగాణలో రేషన్ కార్డుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. రేషన్ కార్డుల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే దీనికి ప్రత్యేకత ఏమీలేదని, దరఖాస్తు ఎప్పుడైనా చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుల కోసం ఎవరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

అందుకోసం ఎలాంటి గడువు లేదని అర్హుల ఆధారంగా కార్డులు జారీ చేస్తూనే ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందని చెప్పారు.

మార్చి 6 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు :

మార్చి ఆరవ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులపాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అధికారులు బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించాలని సూచించారు.

MOST READ : 

  1. Khammam : వెలుగుమట్ల బాధితులకు బీజేపీ అండ.. బాధితులను పరామర్శించిన ఈటెల..!
  2. Nalgonda : నల్గొండలోని వైద్య కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం.. హాజరైన జిల్లా కలెక్టర్..!
  3. Miryalaguda : కరెంటు మీటర్ రీడర్స్ కు 30 రోజుల పని కల్పించాలి..!
  4. Nalgonda : నల్లగొండ జిల్లా ఆణిముత్యం సాన్వీ సాగర్..!

మరిన్ని వార్తలు