TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ అయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నట్లుగా తేలడంతో వారిని జాబితా నుంచి తొలగించి వారికి రేషన్ కార్డులు కట్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని మొదటగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సర్వే నిర్వహించారు.

ఈ సర్వే ఆధారంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 2027 రేషన్ షాప్ ల పరిధిలో సర్వే నిర్వహించగా 92,135 రేషన్ కార్డులు అనర్హులకు ఉన్నట్లు తేలింది.

వీరంతా గత ఆరు మాసాలుగా రేషన్ తీసుకోనట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారి రేషన్ కార్డులను కట్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు రేషన్ కార్డుల తొలగించే ప్రక్రియ మొదలయింది. రేషన్ తీసుకొని వారితో పాటు చనిపోయిన వారి పేర్లు కూడా రేషన్ కార్డు లోనే ఉండటం వల్ల రేషన్ బియ్యం అదనంగా కేటాయించాల్సి వస్తుందని ప్రభుత్వం భావించి ఈ సర్వే ప్రక్రియను ప్రారంభించింది.

ఆరోగ్యశ్రీ కోసమే :

రాష్ట్రంలో చాలామంది అనర్హులు రేషన్ కార్డును పొంది ఉన్నట్లుగా పౌరసరఫరాల శాఖ గుర్తించింది. వారు కేవలం ఆరోగ్యశ్రీ కోసమే కార్డును పొందినట్లుగా తెలుస్తుంది. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి వారి రేషన్ కార్డులకు కోతపెట్టనున్నారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)

  2. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

  3. Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!

  4. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు