Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

రామసముద్రం ఎస్ఐగా రవికుమార్ బాధ్యతల స్వీకరణ..!

రామసముద్రం ఎస్ఐగా రవికుమార్ బాధ్యతల స్వీకరణ..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎస్సైగా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష, డి.ఎస్.పి కొండయ్య నాయుడు, తాలూకా సిఐ సత్యనారాయణ లను కలిసి విధుల్లో చేరారు. గతంలో కూడా రవికుమార్ ఇదే రామసముద్రం మండలంలో ఎస్ఐగా పనిచేసి శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, పేకాట, కోడి పందాలు, కర్ణాటక మద్యం, అక్రమ ఇసుక రవాణా విషయంలో ఎంతో బాధ్యతగా పనిచేశారు.

ఈ మేరకు రెండోసారి ఈయన పనితీరును గుర్తించిన పోలీస్ శాఖ రామసముద్రం ఎస్సైగా అవకాశం ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రానికి రామసముద్రం పోలీస్ స్టేషన్ అతి సమీపంలో ఉండడంతో నిత్యం అక్రమ మద్యం, ఇసుక, కల్ప రవాణా జరుగుతుంది. వీటిపై ప్రత్యేక నిఘా ఉంచి ఉక్కు పాదం మోపెలా కృషి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. అందుకనే ఈ మండలానికి తిరిగి రెండోసారి ఎస్సైగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నియమించారు.

విధుల్లో చేరిన వెంటనే తన సిబ్బందితో నేరాల అదుపు, శాంతి భద్రతలు, రామసముద్రంలో ట్రాఫిక్ నియంత్రణ, కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా రవాణా అయ్యే మద్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా వెళ్లే రేషన్ బియ్యం, కలపపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా, బాధ్యతగా పనిచేయాలని తన సిబ్బందికి ఎస్సై రవికుమార్ సూచించారు.

MOST READ :

  1. Holidays : విద్యార్థులకు అదురిపోయే న్యూస్.. ఈ నెల్లోనే వరుస సెలవులు..!

  2. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

  3. Suryapet : మిరపలో తెగుళ్ల నిర్వహణకై యాజమాన్య పద్ధతులు పాటించాలి..!

  4. Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు