Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!
Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!
దేవరకొండ, మనసాక్షి :
వరద నీటిలో చిక్కుకున్న వారిని పగలు, రాత్రి కష్టపడి క్షేమంగా తీసుకొచ్చి పోలీసులు రియల్ హీరోలుగా మిగిలారు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో పదిమందిని పోలీసులు కాపాడారు వివరాల ప్రకారం..
నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి దిండి వాగు వరద నీటిలో చేపల వేటకు వెళ్లి పదిమంది చెంచులు చిక్కుకున్నారు వీరంతా నల్లగొండ జిల్లా డిండి మండలం దెయ్యం గుండ్లకు చెందినవారు.
సోమవారం సాయంత్రం 6 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నట్లు సమాచారం అందినే వెంటనే నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆరోజు రాత్రి నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. రిస్క్యూ చేసి బాధితును కనిపెట్టారు.
బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం పదార్థాలు అందజేశారు. రాత్రి సమయంలో ఎక్కువ వరద ఉధృతి ఉండటం వలన మంగళవారం ఉదయం బాధితులను తాడు ద్వారా నాగర్ కర్నూల్ పోలీసుల సహాయంతో బయటికి తీసుకొచ్చారు.
LATEST UPDATE :
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు..!
Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!
Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!









