Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రైతులందరికీ రుణమాఫీ రాకపోవడంతో గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. రుణమాఫీ కానీ రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు.

సాంకేతిక కారణాలవల్ల అనేకమంది రైతులకు రుణమాఫీ కాలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందుకుగాను ఆందోళనలను చెక్ పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కృషి చేస్తోంది. రైతులు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, చిన్నచిన్న సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కాని రైతులకు తిరిగి వారి ఖాతాలలో డబ్బు జమ అవుతుందని మంత్రులు భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15వ తేదీ లోగా 18 వేల కోట్ల రూపాయలను 22 లక్షల రైతుల ఖాతాలలో జమ చేశారు. కాగా మిగతా రైతులకు సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ అందలేదు.

అంతేకాకుండా రెండు లక్షల రూపాయల రుణం కు పైగా ఉన్న రైతులు అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ దానికి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న రైతులు అదనపు డబ్బులు చెల్లించడానికి మంత్రివర్గం సమావేశమై నిర్ణయం తెలియజేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 ఖాతాలలో ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం, లక్ష 61 వేల ఖాతాలలో ఆధార్, పాసుబుక్ లింకు లేకపోవడం, 1. 50 లక్షల ఎకౌంట్ లలో బ్యాంకు తప్పిదాలు ఉండడం, 4 లక్షల 83 వేల ఎకౌంట్లకు రేషన్ కార్డు లేని ఖాతాలు ఉండడం, ఎనిమిది లక్షల ఎకౌంట్లకు రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉండటం జరిగింది.

ఇదిలా ఉండగా రైతు భరోసా యాప్ ద్వారా కుటుంబ నిర్ధారణ సర్వే చేస్తున్నారు. ముందుగా రుణమాఫీ అందని రైతుల నుంచి ఫిర్యాదులను వ్యవసాయ అధికారులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి స్వీకరించారు. ఆ తర్వాత రైతుల ఇండ్లకే వ్యవసాయ అధికారులు వెళ్లి పరిశీలించి కుటుంబా నిర్ధారణ చేస్తున్నారు.

కాగా రైతులు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి కుటుంబ నిర్ధారణ అయ్యాక అధికారులు రైతు భరోసా యాప్ లో వివరాలను అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వారి వారి ఖాతాలలో పడుతుంది.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే అనేక పర్యాయాలు చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి కుటుంబ నిర్ధారణ జరిగిన రైతులకు రుణమాఫీ వారి వారి ఖాతాలలో జమాయే అవకాశాలు ఉన్నాయి.

LATEST UPDATE : 

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు