Nalgonda : రెడ్డి జాగృతి.. బతుకమ్మ సంబరాలు సక్సెస్..!

Nalgonda : రెడ్డి జాగృతి.. బతుకమ్మ సంబరాలు సక్సెస్..!
నల్లగొండ, మన సాక్షి :
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 25న జరిగిన బతుకమ్మ సంబరాలు విజయవంతం అయిందని ఇంతటి జయానికి కారణమైన మహిళాలకు ప్రత్యేక, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రెడ్డి జాగృతి మహిళా జిల్లా అధ్యక్షురాలు మందడి సంధ్యా రెడ్డి తెలిపారు.
సోమవారం ఆమె కృతుంగా హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తీరోక్క పూలతో వివిధ కాలనీల నుండి బతుకమ్మలను పేర్చి ఎన్జీ కళాశాల మైదానం కి బతుకమ్మలతో ర్యాలీగా వచ్చి విజయవంతం చేసిన వారికి, పోలీసులకు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
మహిళలు రాజకీయంగా ఉద్యోగాలపరంగా సమాజంలో ముందడుగులో ఉండాలని కోరుకున్నారు .రాజకీయాలకి అతీతంగా సహకరించిన వివిధ పార్టీల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు గాదె సైదిరెడ్డి యువజన అధ్యక్షుడు, మైల మురళీధర్ రెడ్డి, నాయకులు ,కందిమల్ల నాగమణి రెడ్డి, కోమటిరెడ్డి అరుణ, బుచ్చిరెడ్డి ,యాస సరళ రెడ్డి ,జినుగు జ్యోతి రెడ్డి, నామిరెడ్డి శ్రీలత రెడ్డి, మైల జ్యోతి, బోధనపు శోభ, అలుగుబెల్లి వెంకటరెడ్డి, కంచరకుంట్ల వెంకటరెడ్డి, గున్ రెడ్డి వెంకట్ రెడ్డి, కోట్ల అశోక్ రెడ్డి, దోనాల నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!
-
Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. అక్రమ షెడ్ల తొలగింపు..!
-
Curd : ఏ సమయంలో పెరుగు తింటున్నారు.. ఏం జరుగుతుందో తెలుసా..!
-
Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికల తేదీలు ఇవే..!
-
Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!









