Miryalaguda : పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదన తగదు..!
Miryalaguda : పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదన తగదు..!
బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ దశరథ్ నాయక్
మిర్యాలగూడ, మన సాక్షి:
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోధ్ దశరథ్ నాయక్ కోరారు. గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే 58 ఏండ్లు వున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ 61 సంవత్సరాలకు గత ప్రభుత్వం పెంచిందని మరో మారు 2నుండి 4సంవత్సారాలు పెంచాలనే ప్రతిపాదన చేయడం సరైంది కాదన్నారు.
ఏ ఉద్యోగి పదవీ విరమణ వయస్సు పెంపు కోరడం లేదని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వయస్సు పెంపు సరైంది కాదన్నారు. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం చూస్తున్నారని ఈ తరుణంలో పదవీ విరమణ వయస్సు పెంచి నిరుద్యోగులను ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడాన్ని బంజారా ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోందని తెలిపారు.
వయస్సు పెంపు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని అనుకోవడం లేదని అధికారులు ప్రతిపాదించిన ప్రభుత్వం అట్టి ప్రతిపాదనను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కో కన్వీనర్లు నాగేశ్వర్ రావు, తుకారాం, మాత్రు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
| MOST READ :
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)
-
Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!
-
Nalgonda : 11 మంది ఏ.యస్.ఐ లకు, యస్.ఐ లుగా పదోన్నతి..!









