Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
తెలంగాణ కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం వల్ల పేదలు అనేక ఇబ్బందులను పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సర్కారు పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. కాగా కొత్త రేషన్ కార్డు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రేషన్ కార్డులకు మార్గదర్శకాలు ప్రక్రియ పరిశీలిస్తే.. వాటిలో..
కుల గణన సర్వే లో రేషన్ కార్డులు లేని వారికి జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు
రేషన్ కార్డుల జాబితాను జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామసభ వార్డు సభలలో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి సభలో చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.
జన గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్ / జిహెచ్ఎంసి కమిషనర్ కు పంపిస్తారు.
మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం మేరకు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక జరగనున్నది.
అర్హత కలిగిన వారందరికీ జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
MOST READ :
-
Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!
-
Gold Price : పసిడి ధర మళ్లీ పెరిగింది.. ఈరోజు తులం ఎంతంటే..?
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!









