తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : కెసిఆర్ ను మించిన రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణ..!

Miryalaguda : కెసిఆర్ ను మించిన రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మోసపూరితమైన వాగ్దానాలు చేయడం అమలు చేయకపోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని మించిపోయాడని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన ఖమ్మం నల్గొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం సోమవారం నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు.

అందులో భాగంగా ఈరోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని విగ్నేశ్వర ఎస్టేట్స్ మినీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఇతర అలవెన్స్ లు వెంటనే ఇస్తానని హామీ ఇచ్చి నేటి వరకు కూడా అమలు చేయలేదని ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు .

ఈ ప్రభుత్వంపై ప్రజలు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారని తన పర్యటనలో బిజెపికి అవకాశం ఇచ్చి ఉంటే బాగా ఉండేదని అనుకుంటున్నారని ఈ ఎమ్మెల్సీ లో బిజెపి అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని ఉపాధ్యాయులు, లెక్చరర్స్ అంటున్నారని చెప్పారు. మోడీ నమ్మకంతో ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా లో బిజెపికి పట్టం కట్టారని చెప్పారు.

ఈ ప్రభుత్వం పాలనలో రిటైర్డ్ ఉద్యోగులు తమ గ్రాడ్యుటీలు తీసుకోవాలన్న 10% కమిషన్ ఇచ్చి తీసుకునే దుస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. 2021 నుంచి పిబిఎస్ పథకంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని, మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పిబిఎస్ ఫండ్ ను వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పారని ఆ హామీ కూడా నేటికి నోచుకోలేదని చెప్పారు .

ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలలు, కేంద్రీయ పాఠశాలలు ఉపాధ్యాయులకు నెల నెల జీతం అందించలేదనీ ఇటువంటి సమర్థ ప్రభుత్వం వలన ఉపాధ్యాయలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారత్ జాతి గౌరవం ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మోడీదనీ ఆయన బాటలో మనమందరం నడవాల్సిన అవసరం ఉండాలి చెప్పారు.

ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కానీ ఇతరులను గెలిపించిన ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. అది భారతీయ జనతా పార్టీ చెందిన అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించడం వలన శాసనమండలి, శాసనసభలో ఉపాధ్యాయ మోడల్స్ స్కూల్స్ సమస్యలను పరిష్కరించేందుకు ఒత్తిడి చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఇంటర్నెట్ అనే కొత్త పథకం ప్రవేశపెట్టిందని నెలకు 5000 రూపాయలు స్టాఫ్ ఉంటుందని అదేవిధంగా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో లేదని ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ సంవత్సర కాలం అవుతున్న ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన మూడు డిఏ నేటి వరకు కూడా మంజూరు చేయలేని అసమర్ధ ప్రభుత్వం ను తరిమి కొట్టాలన్నారు . ఈ ఏడాది ఎనిమిది ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయితే వారికి రావాల్సిన గ్రాడ్యుటీలను ఇంతవరకు చెల్లించని అధ్వానమైన ప్రభుత్వం ఇదని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాధినేని శ్రీనివాసరావు, బిజెపి జిల్లా నాయకులు భేటీ సుభాష్ రెడ్డి, పాపారావు, ఇది మహిళా నాయకురాలు సునీత రెడ్డి, కంకణాల నివేదిత రెడ్డి, మిర్యాలగూడ బిజెపి మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, బంటు సైదులు, ఎడ్ల సైదులు, కన్మంత్ రెడ్డి అశోక్ రెడ్డి, మిర్యాలగూడ ఒకటో పట్టణ, రెండో పట్టణ బిజెపి అధ్యక్షులు బంటుగిరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

■ MOST READ : 

  1. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  2. Breaking News : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

మరిన్ని వార్తలు