Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

BREAKING : రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి, 21 మందికి తీవ్ర గాయాలు..!

BREAKING : రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి, 21 మందికి తీవ్ర గాయాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మధ్యప్రదేశ్లోని దిండూరి లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. పికప్ వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో 14 మంది మరణించగా 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

షాపురా పోలీస్ స్టేషన్ పరిధిలో అమాహి డియోరి గ్రామంలో నుంచి జర్దార్ ఘాటుకు తిరిగి వస్తుండగా పికప్ వాహనం బ్రేకులు దెబ్బ తినడంతో అదుపుతప్పి 20 అడుగుల దిగువన బోల్తా పడింది. దీంతో ప్రమాదం లో 14 మంది మరణించగా 21 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ : BIG BREAKING : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

మరిన్ని వార్తలు