BIG BREAKING : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణలో మెగ్ డీఎస్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.

BIG BREAKING : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మెగ్ డీఎస్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య తో సహా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే గ్యారెంటీ హామీల అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మెగా డీఎస్సీని ప్రకటించి ఎంతో ఊరట కల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ లో గత ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేశారు. కానీ గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్లో డీఎస్సీ పరీక్ష స్కూల్ అసిస్టెంట్స్ 2849, ఎస్జీటీ 7304, లాంగ్వేజ్ పండిట్ లు 727, పిఈటి 182,

అభ్యర్థుల వయసు 46 సంవత్సరాలుగా నిర్ణయించారు. డీఎస్సీ ఆన్లైన్ విధానం ద్వారా పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

ALSO READ : Telangana : కేటీఆర్ పై క్రిమినల్ కేసు..? క్షమాపణ చెప్పకుంటే పెడతాం..!