క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..! 

TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..! 

శంకర్‌పల్లి, (మన సాక్షి):

పట్టపగలు ఇద్దరి వ్యక్తుల కళ్ళల్లో కారం కొట్టి రూ. 40 లక్షలు చోరీ చేసి ముగ్గురు దుండగులు పారిపోయిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన 40 లక్షల రూపాయలను వికారాబాద్ పట్టణానికి వెళ్లి తన యొక్క కస్టమర్ దగ్గర నుంచి తీసుకుని రావాల్సిందిగా రాకేష్ అగర్వాల్ వద్ద పనిచేసే ఇద్దరు వ్యక్తులను శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30- 1:00 గంటల సమయంలో వికారాబాద్ నుంచి 40 లక్షల డబ్బులు తీసుకొని రావాసిందిగా సాయిబాబా, మణి వ్యక్తులను పంపారు.

వారు డబ్బులను తీసుకొని కారులో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల ప్రాంతంలో శంకర్‌పల్లి మండల పరిధిలోని హుస్సేన్ పూర్ గ్రామ శివారులో వారిని వెనకనుంచి అనుసరిస్తూ నలుగురు గుర్తు వ్యక్తులు షిఫ్ట్ డిజైర్ వాహనంలో వెంబడించి హుస్సేన్ పూర్ గ్రామ శివారులో నిర్మానుషమైన ప్రాంతంలో వాహనాన్ని అడ్డగించి, ముగ్గురు వ్యక్తులు మొహాలు మాస్క్ ధరించి బాధితుల కార్ వద్దకు వచ్చి డ్రైవర్ కళ్ళలో కారం చెల్లి వెనుక సీటులో కూర్చున్న సాయిబాబా అనే వ్యక్తిని కొట్టి, అద్దం పగలగొట్టి రాయితో దాడి చేసినారు.

అతనిని గాయపరిచి డ్రైవర్ ను కూడా గాయపరిచి, 40 లక్షల రూపాయలు గల బ్యాగును రాబరీ చేసి తీసుకెళ్లారు. అయితే అలా పారిపోతున్న క్రమంలో నాలుగు కిలో మీటర్లు దాటిన తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులో నేరస్తుల కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టుకు ఢీ కొట్టి బోల్తా పడింది.

వెంటనే నేరస్థులు కారులో నుంచి బయటకు వచ్చి కారును అక్కడే వదిలి డబ్బు తీసుకొని పారిపోయారు. కారు బోల్తా పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు సంఘటన స్థలంలో గుమిగూడారు. దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి పోలీసులు, నార్సింగ్ ఏసిపి వెంకట రమణ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ లో భాగంగా క్లూస్ టీం ఫింగర్ ప్రింట్స్, డాగ్స్ స్క్వాడ్ సహాయంతో సాక్షాదారాలు సేకరించారు. సిసిఎస్, ఎస్ఓటి పోలీసులు బృందాల సహాయంతో నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

బోల్తా పడిన స్థలాన్ని పరిశీలించగా, దానిలో నేరస్తులకు సంబంధించిన కొన్ని వస్తువులను, కొంత నగదును గుర్తించడం జరిగింది. వాటిని సీజ్ చేసి తదుపరి విచారణకు ఉపయోగించడం జరుగుతుంది. అయితే పూర్తిగా సంఘటనను పరిశీలించిన పిదప నేరస్తులు బాధితులను వికారాబాద్ నుంచి పథకం ప్రకారం వెంబడించినట్లుగా అర్థమవుతుంది. త్వరలో నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తామని శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.

MOST READ : 

  1. Urea : యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.. మహిళ చేతి వేళ్లకు తీవ్ర గాయం..!

  2. Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

  3. Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

  4. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

  5. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

మరిన్ని వార్తలు