Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Urea : యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.. మహిళ చేతి వేళ్లకు తీవ్ర గాయం..!

Urea : యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.. మహిళ చేతి వేళ్లకు తీవ్ర గాయం..!

మాడుగులపల్లి, మన సాక్షి :

వర్షాకాల సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడుతూనే ఉన్నారు. వ్యవసాయ పనులు వదులుకొని ఎండనక, వాననక షాపుల ముందు పడిగాపులు కాయవలసి వస్తుంది.

శుక్రవారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో సహకార బ్యాంకు ముందు బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు యూరియాను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతూ కాలాన్ని గడుపుతున్నారే తప్ప నెల రోజుల నుండి రైతులకు సకాలంలో యూరియా అందించ లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడం లేదని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు సరఫరా చేయడం లేదని ఎండగట్టారు.

రెండు మూడు రోజులలో రైతులకు సరిపడా యూరియాను అందించకపోతే జిల్లా కేంద్రాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఇలాగైతే రైతులు అనుకున్న దిగుబడిని సాధించలేరని దానికి నష్టపరిహారంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రభుత్వాలకు హెచ్చరించారు.

ఇందుగుల గ్రామానికి చెందిన గామల ఎల్లమ్మ యూరియా కోసమని కిటికీ ముందు నిలబడి ఉండగా కిటికీ ఒక్కసారిగా తెరవడంతో కిటికీలో చెయ్యి పడి తీవ్ర గాయం కావడంతో 108 ద్వారా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

MOST READ : 

  1. District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!

  2. Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

  3. Doctorate : ఆటో డ్రైవర్ కుమారుడికి డాక్టరేట్.. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశోధన..!

  4. Nalgonda : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన రోడ్లు..!

మరిన్ని వార్తలు