Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

RSS : ఆర్.ఎస్.ఎస్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.!

సంఘం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని, దేశ ఉన్నతి కోసం పని చేయాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు రామ్ మాధవ్ జి అన్నారు.

RSS : ఆర్.ఎస్.ఎస్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.!

సంఘం అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు రామ్ మాధవ్ జీ

కరీంనగర్, మనసాక్షి :

సంఘం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని, దేశ ఉన్నతి కోసం పని చేయాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందని అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు రామ్ మాధవ్ జి అన్నారు. సంఘ శతజయంతి లో కరీనగర్ పట్టణంలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంఘాన్ని అర్థం చేసుకోవటం కష్టం, అపార్థం చేసుకోవటం సులువని అన్నారు. సంఘం కొత్త సిద్ధాంతాన్ని చెప్పటం లేదని ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంస్కృతిక పరంపర నుండి వికసించిన అంశాలనే చెబుతుందని తెలిపారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, మహాభారతాల పరంపరలోని అంశాలే సంఘం చెప్తున్న సిద్ధాంతమని చెప్పారు.

ఇదే ఆలోచనతో అరవింద ఘోష్, బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లు కూడా పనిచేశారని చెప్పారు. డాక్టర్ హెడ్గేవార్ జీ అదే పరంపరలో సంఘ్ ను స్థాపించారన్నారు. సంఘం వందేళ్ల ప్రయాణాన్ని నాలుగు దశలుగా చెప్పుకోవచ్చని మొదటి దశలో సంఘము అవరోధాన్ని, వ్యతిరేకతని ఎదుర్కొందని, రెండవ దశలో ప్రజల్లోకి వెళ్లి అనుకూల వాతావరణాన్ని నిర్మించుకుందని, మూడవ దశలో సామాజిక సమస్యల పరిష్కారానికి నడుం బిగించిందని, దీంతోనే వివిధ క్షేత్రాలు ప్రారంభమయ్యాయన్నారు.

నాలుగవ దశలో దేశంలోని సామాన్య జన బాహుళ్యంలోకి సంఘం విస్తరించిందని సోదాహరణంగా చెప్పారు. సంఘం పని పూర్తి కాలేదని, భవిష్యత్ భారత నిర్మాణం కోసం పంచ పరివర్తన ను ముందు నిలిపిందని వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ సహసంఘచాలకులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, జిల్లా సంఘచాలకులు నిరంజన చారి, జిల్లా సహసంఘచాలకులు ఎలగందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Also ReadNalgonda : నల్గొండ జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

మరిన్ని వార్తలు