Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!

TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!

హైదరాబాద్, మనసాక్షి :
డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంది. డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 5 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే చెల్లింపులు కొనసాగుతున్నాయి. ప్రతి చిన్న వ్యాపారి కూడా యూపీఐ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నారు.

టీ షాప్ లో , కిరాణా దుకాణాలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు ఇలా.. ప్రతి చోట కూడా డిజిటల్ చెల్లింపులే స్వీకరిస్తున్నారు. దానివల్ల దేశవ్యాప్తంగా కూడా డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. వినియోగదారులు కూడా ఫోన్ పే , గూగుల్ పే , అమెజాన్, పేటియం లాంటి యాప్ ల ద్వారా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు.

కొన్ని సమయాల్లో చిల్లర సమస్య రావడం వల్ల ఎక్కువమంది కూడా యూపీఐ పేమెంట్ ల ద్వారానే స్వీకరిస్తున్నారు. వాటి వల్ల ఎలాంటి చెల్లింపుల సమస్య రాకుండా ఉంటుంది. ప్రతి చిన్న వస్తువులు కొనుగోలు చేసినా డిజిటల్ చెల్లింపులను వినియోగించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ చెల్లింపులను చేసేందుకే ఇష్టపడుతున్నారు.

ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!

ఆర్టీసీ బస్సుల్లో :

ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ చెల్లింపుల వైపు వెళ్లడంతో ఆర్టీసీ కూడా బస్సులలో టికెట్ కొనుగోలుకు యూపీఐ ద్వారా చెల్లింపులను స్వీకరించాలని నిర్ణయించింది. ఈ డిజిటల్ చెల్లింపులను త్వరలో రాష్ట్రంలోని అన్ని రకాల బస్సులలో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ తోపాటు అన్ని రకాల బస్సులలో కూడా డిజిటల్ పేమెంట్ లను స్వీకరించాలని నిర్ణయించింది.

కండక్టర్లు ఉండే బస్సులలో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ తో పాటు మిగతా బస్సులలో కూడా ఐ – టీమ్స్ యంత్రాలను పంపిణీ చేస్తున్నారు. వాటి వల్ల టికెట్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్ పే ,గూగుల్ పే , పేటీఎం, అమెజాన్ పే తో పాటు ఇతర యూపీఐ యాప్ లను వినియోగించి టికెట్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!

మొట్టమొదటగా హైదరాబాదులో :

ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులను మొట్టమొదటగా హైదరాబాదులోనే ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాదులోని బండ్లగూడ బస్ డిపో పరిధిలో డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. ఈ డిపోలోని అన్ని రకాల బస్సులలో డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. బండ్లగూడ బస్ డిపోలో 45 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులలో ఐ – టిమ్స్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు.

ఆ తర్వాత కంటోన్మెంట్ డిపోలో అమలు చేయనున్నారు. ఈ రెండు డిపోలలో ఐ – టిమ్స్ ద్వారా డిజిటల్ చెల్లింపులు విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో డిజిటల్ చెల్లింపులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 8300 ఆర్టిసి బస్సులలో దఫా దఫాలుగా డిజిటల్ పేమెంట్ లను స్వీకరించే క్రమాన్ని అమలు చేయనున్నారు.

ALSO READ : Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!

ప్రయాణికులకు సౌకర్యం :

ఆర్టిసి కూడా యూపీఐ పేమెంట్లను స్వీకరించడం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది . ఇక ఆర్టీసీ బస్సులలో చిల్లర సమస్య అనేది రాకుండా ఉంటుంది. చాలామంది చిల్లర సమస్యతో అనేక ఇబ్బందులు పడుతుంటారు . ఆర్టీసీ బస్సులలో కూడా డిజిటల్ పేమెంట్లు స్వీకరించడం వల్ల ఇకపై ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు