Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లావ్యవసాయం

నారాయణపేట : నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!

నారాయణపేట : నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!

నారాయణపేట టౌన్, మన సాక్షి:

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వీడియో కాన్ఫరెన్స్ హల్ లో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ 2018 పై సమీక్షించారు. నెలాఖరు లోగా రుణ మాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 45112 మంది రైతులకు గాను 256 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించనుందని, ఇప్పటి వరకు 131కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు మాఫీ జాబితాని గ్రామాల వారీగా సరిచేసి డబ్బులు జమకాని రైతుల  రైతురుణ ఖాతాలోంచి సేవింగ్ ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని అన్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

గురువారం ఉదయం ఉదయం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  జిల్లా లో రైతుల వివరాలు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు.
రైతు భీమా లో నిర్లక్షం వహించరదన్నారు. రైతు చనిపోయిన 9 రోజులలో రైతు భీమా అందించాలని వారి యొక్క నామిని ఖాతాలో డబ్బులను జమచేయాలన్నారు.

జిల్లా లో నేటికీ ఆయిల్ 2000 ఏకరాలలో ఇప్పటివరకు సాగు చేయడం జరుగుతుందని ఇంక 1000 ఏకరలలో సాగు దిశగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన అధికారులతో కలిసి రైతు ల ద్వారా డిడి లు కట్టించి ఆయిల్ ఫార్మ్ సాగు పై మొగ్గు చుపెటట్లు చూడాలన్నారు.

ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!

ఇదివరకే డ్రిప్ కై డిడి లు అందించిన రైతులకు డ్రిప్ లను అందించాలన్నారు. ఫర్టి లైజర్ వివరాలను ఈ పాస్ లో మరియు నిల్వ గల వివరాలలో వ్యత్యాసం ఉండకుండా చూడాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఉద్యానవన జిల్లా అధికారి సాయి బాబా మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Nalgonda : నల్గొండలో విచిత్ర దొంగలు.. వాళ్లు దోచుకునేవి ఏంటో తెలుసా..!

మరిన్ని వార్తలు