Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలో విచిత్ర దొంగలు.. వాళ్లు దోచుకునేవి ఏంటో తెలుసా..!

Nalgonda : నల్గొండలో విచిత్ర దొంగలు.. వాళ్లు దోచుకునేవి ఏంటో తెలుసా..!

నల్గొండ, మనసాక్షి :
సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే డబ్బులు, బంగారం ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. కానీ నల్లగొండలో విచిత్ర దొంగతనాలు జరుగుతున్నాయి. నల్లగొండలో ఈ విచిత్రమైన దొంగలు ఇంటిముందు వాహనాలు, కార్లు వదిలేసి , ఇండ్లలో బంగారం, నగదును కూడా దోచుకోకుండా విచిత్ర దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆ విచిత్రమైన దొంగతనాలు ఏంటి..? అసలు వారు ఎత్తుకెళ్తున్న వస్తువులు ఏంటో..? తెలుసుకుందాం..

ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ఇంటి గేట్లకు తాళాలు వేస్తుంటాము. ఇంట్లో దొంగతనం జరిగిన పట్టించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటాం.. దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఆయా కాలనీల ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను వివరిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

అయినా కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సీసీ కెమెరాలతో దొంగలు దొరికిపోతున్నారు. అయినా నల్గొండ పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. దొంగతనాల బంగారాన్ని బయటపెట్టి పోలీసులకు పట్టిస్తున్న సీసీ కెమెరాలు వైపు దొంగల దృష్టి మళ్లింది.

దొంగతనాలను పట్టిస్తున్నాయనో..? లేదా వేరే కారణం చేతనో కానీ నల్లగొండలో మాత్రం సీసీ కెమెరాలను దోచుకెళ్తున్నారు ఆ దొంగలు. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఇళ్లకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయం చేశారు. సీసీ కెమెరాలు మాయం కావడంతో ఆ కాలనీ యజమానులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!

అయితే వారం రోజుల లో శ్రీనగర్ కాలనీలో మూడిళ్లలో సీసీ కెమెరాలు మాయం కావడంతో కాలనీవాసులు ఆందోళన చెపుతున్నారు. వారి దొంగతనాలకు పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. ఈ దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో కూడా రికార్డ్ అయ్యాయి. సీసీ పూటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : పెట్రోల్ బంకుల్లో సివిల్ సప్లై అధికారులు నామమాత్రపు తనిఖీలు

మరిన్ని వార్తలు