Nagarjunasagar : తెరుచుకున్న సాగర్ గేట్లు.. నిండుగా కాలువలు.. పంట పొలాల్లో రైతుల సందడి..!
Nagarjunasagar : తెరుచుకున్న సాగర్ గేట్లు.. నిండుగా కాలువలు.. పంట పొలాల్లో రైతుల సందడి..!
మన సాక్షి, నల్గొండ బ్యూరో :
తెరుచుకున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు.. కాలువల నిండుగా సాగునీరు.. పంట పొలాల్లో రైతుల సందడి.. ఇది నాగార్జునసాగర్ ఆయకట్టు పరిస్థితి.
నాగార్జునసాగర్ ఆయకట్టు అంతా ఆహ్లాదంగా మారింది. రెండేళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూసిన రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు.
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తుండగా మరోవైపు ఎడమ కాలువకు పంటలకు నీటిని విడుదల చేశారు. దాంతో ఆయకట్టులో వరి సాగు చేసుకుంటున్న రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ.. బిజీగా.. గడుపుతున్నారు.
శ్రీశైలం నుంచి భారీగా వరదరావడంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం సాగర్ ప్రాజెక్టుకు ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి.
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. జలాశయంలో 590 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం క గాను ప్రస్తుతం 585.40 అడుగుల నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 284 నీరు ఉంది.
పర్యాటకుల సందడి :
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో సాగర్ కు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సాగర్ ప్రాజెక్టును చూసేందుకు తరలివస్తున్నారు.
ఇదిలా ఉండగా సాగర్ ఆయకట్టులో సాగునీటి కోసం నీటిని విడుదల చేయడంతో రైతులు పంట పొలాలను సాగు చేసుకుంటున్నారు. సాగర్ ఆయకట్టు అంతా అహ్లాదంగా మారింది. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందుతుంది.
ALSO READ :
Nagarjunasagar : తెరుచుకున్న నాగార్జునసాగర్ గేట్లు.. 6 గేట్ల ద్వారా నీటి విడుదల.. Latest Update
Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!










