Miryalaguda : మిర్యాలగూడలోని సాయితేజ సాల్వెంట్ మిల్లులో సూపర్ వైజర్ మృతి..!
Miryalaguda : మిర్యాలగూడలోని సాయితేజ సాల్వెంట్ మిల్లులో సూపర్ వైజర్ మృతి..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని సాయి తేజ సాల్వెంట్ మిల్ సూపర్ వైజర్ మహమ్మద్ జమీరుద్దీన్ మృతి చెందాడు. వివరాల ప్రకారం మహమ్మద్ జమీరుద్దీన్ (55) సాయి తేజ సాల్వెంట్ మిల్ నందు సూపర్ వైజర్ పనిచేస్తున్నాడు.
బాలాజి నగర్, సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం మిర్యాలగూడ టౌన్ తాళ్ళగడ్డలో నివాసం ఉంటున్నారు. యాదార్ పల్లి గ్రామ శివారులో గల సాయితేజ సాల్వెంట్ మిల్ నందు సూపర్ వైజర్ పని చేస్తున్నాడు. మృతినికి భార్య నసీమ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రోజు మాదిరిగానే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మృతుడు పని చేసే సాయితేజ సాల్వెంట్ మిల్ నందు డ్యూటీ నిమిత్తం వెళ్ళి,మిల్లులో డ్యూటీ చేస్తుండగా సాయంత్రం సుమారు 4 గంటలకు మృతినికి
ఛాతిలో నొప్పి బాగా వస్తుంది అంటూ క్రింద పడిపోతుండగా అక్కడే డ్యూటిలో ఉన్న చిక్కుల నాగేందర్ మరియు శ్రీను అను వారు చూచి లేపి ఆటొలో తీసుకొని వెళ్ళుచు మృతిని సంబందికులకు సమాచారం ఇచ్చారు.
వారు వెంటనే మృత్తిడిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ మెడి క్యూర్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడి నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి చికిత్స చేయిస్తుండగా సాయంత్రం 4.45గం.లకు చనిపోయాడు. మృతిని తమ్ముడు నసీరుద్దీన్ దర్యాప్తు మేరకు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ALSO READ :
- BIG BREAKING : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు..!
- Additional Dowry : అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య..!
- Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
- Buddhavanam Entry Tickets : నాగార్జున సాగర్ బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు..!
- Vehicle Inspections : వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలు.. పోలీసుల పట్టివేత..!









