Additional Dowry : అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య..!

అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన శుక్రవారం నాగులపాటి అన్నారం లో జరిగినది.

Additional Dowry : అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య..!

పెన్ పహాడ్, మన సాక్షి

అదనపు కట్నం కోసం భర్త అత్త వేధింపులు తట్టుకోలేక యువతి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన శుక్రవారం నాగులపాటి అన్నారం లో జరిగినది. పెన్ పహాడ్ ఎస్ ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పిండిపోలు అయోధ్య కూతురు చందనను మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆనందం వేణుతో గత మూడు సంవత్సరముల క్రితం వివాహం జరిగినది.

 

ఆనందం చందన భర్త వేణు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 18 నెలల కుమారుడు ఉన్నాడు. వీరి కాపురం సజావుగా జరుగుతున్న సమయంలో అత్త ఆనందం విజయలక్ష్మి ,భర్త వేణు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండగా ఆనందం చందన తన తల్లి తండ్రుల వద్ద అన్నారంలో జీవనం గడుపుతున్నది.

 

కుటుంబ తగాదాలతో గత సంవత్సరం భర్త ఆనందం వేణు పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించడంతో మనస్థాపం చెంది ఇంటిలో శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని మృతి చెందినదని ఎస్సై తెలిపినారు. మృతదేహాన్ని పెన్ పహాడ్ తాసిల్దార్ మందడి మహేందర్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పి రవి, సీఐ సురేందర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించినారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ALSO READ : Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!