TOP STORIESBreaking Newsజాతీయం

Rythu : తెలంగాణ రైతులకు కేంద్రం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్..!

Rythu : తెలంగాణ రైతులకు కేంద్రం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల కోరిక తీర్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డును ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాదులో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం పసుపు బోర్డులో ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయంలో వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన మంత్రి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేశామని,

2023 అక్టోబర్ ఒకటో తేదీన మహబూబ్‌నగర్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయాన్ని ప్రకటించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు పల్లె రంగారెడ్డిని నియమించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు