TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు

Sankranti Special : రాజమండ్రికి మించిన మర్యాద.. కొత్త అల్లుడికి 158 వంటకాలతో సంక్రాంతి విందు..!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త అల్లుళ్లతో ఆంధ్రకు విడదీయరాని బంధం ఉంటుంది. అలాంటిది మరీ గోదావరి జిల్లాలో అయితే ఎంత మరింత బంధం ఉంటుందంటే.. కొత్త అల్లుళ్లను సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా అక్కడివారు భావించి ప్రత్యేక మర్యాదలు చేస్తుంటారు.

Sankranti Special : రాజమండ్రికి మించిన మర్యాద.. కొత్త అల్లుడికి 158 వంటకాలతో సంక్రాంతి విందు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త అల్లుళ్లతో ఆంధ్రకు విడదీయరాని బంధం ఉంటుంది. అలాంటిది మరీ గోదావరి జిల్లాలో అయితే ఎంత మరింత బంధం ఉంటుందంటే.. కొత్త అల్లుళ్లను సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా అక్కడివారు భావించి ప్రత్యేక మర్యాదలు చేస్తుంటారు. అలాంటిది రాజమండ్రికి మించిన అభిమానం.. మర్యాదను చేయడంతో పాటు 158 రకాల వంటకాలతో కొత్త అల్లుడిని ముంచెత్తారు. అది ఎక్కడో చూద్దాం..

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె మౌనికను గత సంవత్సరం రాజమండ్రి కి చెందిన శ్రీ దత్తకు ఇచ్చి వివాహం చేశారు. వివాహం తర్వాత శ్రీదత్త తమ ఇంటికి సంక్రాంతి పండుగకు తొలిసారిగా రావడంతో అత్తమామలు మర్చిపోలేని విధంగా విందు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. రాజమండ్రి అల్లుడికి రాజమండ్రి కి మించిన మర్యాద అందించి అభిమానాన్ని చురగొనాలని భావించారు.

158 రకాల వంటకాలు :

సంక్రాంతి విందులో అత్తమామలు ఏకంగా 158 రకాల వంటకాలతో అల్లుడిని ముంచెత్తారు. అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు.. ఇలా సాంప్రదాయ పిండి వంటలే కాకుండా అనేక రకాల స్వీట్లు, పచ్చళ్ళు, వెరైటీ భోజనాలు డైనింగ్ టేబుల్ నిండా వంటకాలను చూసి కొత్తల్లుడు తో పాటు స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తమ అత్తగారి కుటుంబం తన పట్ల ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు కొత్త అల్లుడు మురిసిపోయారు. ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన అత్తమామలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే కేవలం పంటల పండుగ మాత్రమే కాదని తరతరాలుగా వస్తున్న విలువలను, బంధుత్వాలను కలిపే ఒక వారధిగా పేర్కొన్నారు. గోదావరి జిల్లాలకే పరిమితమైన సంక్రాంతి అల్లుడి విందు ఇతర జిల్లాలకు కూడా విస్తరించడం విశేషం.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!

  2. Khammam : విషాద ఘటన.. ఆడుకుంటూ వెళ్లి సాంబారులో పడి చిన్నారి మృతి..!

  3. JalliKattu : జల్లికట్టులో తీవ్ర విషాదం.. 52 మందికి గాయాలు..!

  4. అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!

మరిన్ని వార్తలు