సూర్యాపేట : సంతోషిమాతకు 108 కలశములతో అభిషేకం
సూర్యాపేట : సంతోషిమాతకు 108 కలశములతో అభిషేకం
శ్రీ సంతోషి మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట, మనసాక్షి
శ్రీ సంతోషి మాత అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం శ్రీ సంతోషి మాత అమ్మవారి జన్మదినం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో వ్యవసాయం వ్యాపారం, అన్ని రంగాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి కి అమ్మవారి ఆశీస్సులు ఉండి మేలు జరగాలని కోరారు. సంతోషి మాత జన్మదిన సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ అమ్మవారికి తెల్లవారుజామున 108 కలశములతో అభిషేకం నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు బ్రాహ్మ0డ్లపల్లి దేవిదత్తు అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రములు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MOST READ :
- Suryapet : మంత్రి తో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ పై విచారణ జరపాలి
- Theft : 15 ఏళ్లుగా 45 చోరీలు.. జైలు శిక్ష..!
- Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
- Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
ఈ సందర్భంగా రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తుల సహకారంతో తయారు చేయించిన బంగారు ముత్యాల హారాన్ని, బంగారు రాఖీని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోడ్రాల అశోక్ దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించి రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నరు. సంతోషిమాతకు ఉద్యాపన వ్రతం, ఒడిబియ్యం, మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని వెన్నెల్లో పారాయణం, నామకరణ మహోత్సవం, పవళింపు సేవా కార్యక్రమం నిర్వహించి మూడు రోజులుగా జరుగుతున్న జన్మదిన వేడుకలను పరిసమాప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం కార్యనిర్వాహణాధికారి ఎంఎల్ఆర్ గుప్తా, దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, దేవాలయ కమిటీ కొత్త మల్లికార్జున్, పబ్బా ప్రకాశరావు, తాళ్లపల్లి రామయ్య, దేవరశెట్టి సోమయ్య, యమ వెంకటేశ్వర్లు, నామిరెడ్డి పాపిరెడ్డి, బ్రాహ్మ0డ్లపల్లి సంతోష్ కుమార్, బెలిదేఅశోక్,గోపారపు రాజు దేవాలయ సహాయకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, ధరూరికృష్ణమాచార్యులు, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.









