Nalgonda : ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష..!
Nalgonda : ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష..!
కనగల్, మనసాక్షి :
దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా సెషన్ అండ్ ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి గురువారం సంచలన తీర్పు ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే… నల్లగొండ జిల్లా, కనగల్ మండల పరిధిలోని పర్వతగిరి గ్రామానికి చెందిన నల్లబోతు జగన్ గుర్రంపోడు మండలం శాఖపురం గ్రామానికి చెందిన యువతికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన తర్వాత మాట మార్చగా, బాధితురాలు నిందితుడైన జగన్ పై గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి సరైన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా నిందితుడికి అత్యాచారం చేసినందుకు గాను 10 సంవత్సరాల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా, దళిత యువతని మోసగించినందుకు గాను మరో 10 సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా, యువతని పెళ్లి చేసుకుంటానని చీట్ చేసినందుకు గాను మరో 7 సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మొత్తంగా కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.
కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ సమర్పించిన అప్పటి విచారణ అధికారులు ఎస్డిపిఓలు ఎస్. మహేశ్వర్, టి ఆనంద్, ఏఎస్ఐ ఖలీల్ అహ్మద్, ప్రస్తుత ఏఎస్పీ మౌనిక, గుర్రంపోడ్ ఎస్ హెచ్ ఓ మధు, సిడిఓ ఇంతియాజ్ అహ్మద్, లైసెన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
MOST READ :
-
Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!
-
Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. అర్ధరాత్రి సంచరిస్తూ..!
-
Nelakondapalli : యూనిట్ ఒకటి..180 మంది ధరఖాస్తులు.. లాటరీ ద్వారా ఎంపిక..!









