సికింద్రాబాద్ ఘోర ప్రమాదంలో 8 మంది సజీవ దహనం – latest news

సికింద్రాబాద్ ఘోర ప్రమాదంలో 8 మంది సజీవ దహనం
హైదరాబాద్, మనసాక్షి : సికింద్రాబాద్ ముండా మార్కెట్ పోలీస్ స్టేషన్ సమీపంలో లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 8 మంది సజీవ దహనం అయ్యారు. రూబి లాడ్జి , హోటల్ ఘటన పై అధికారులు విచారణ చేస్తున్నారు. నిర్వాహకులు సుమిత్ సింగ్, రాజేందర్ సింగ్ పై కేసు నమోదు చేశారు. బ్యాటరీలు చార్జింగ్ పెట్టే క్రమంలో ఘటన జరిగినట్లుగా ప్రాథమిక విచారణలొ తేలినట్లు తెలిసింది.

ALSO READ : BIG BREAKING : ఈటెల సస్పెన్షన్

ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో హరీష్, (విజయవాడ) వీరేంద్ర కుమార్ (ఢిల్లీ) సీతారాం (చెన్నై) రాజీవ్ మాలిక్ (ఢిల్లీ ),సందీప్ (ఢిల్లీ), బాలాజీ (చెన్నై) గా గుర్తించారు.
మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.