తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

SSC Exams : పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163BNS అమలు..!

SSC Exams : పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163BNS అమలు..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని జిల్లా ఎస్పీ కె నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 11912 విద్యార్థు లకు 67 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు.

అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు కంగారుగా వెళ్ళవద్దు, సమయానికి బయలుదేరాలనీ, రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ సూచించారు.

MOST READ : 

  1. WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

  4. District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  5. Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు