Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణ.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూత్రధారి..!
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణ.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూత్రధారి..!
సూర్యాపేట రూరల్, మన సాక్షి :
ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డే నని, వెంటనే ప్రభుత్వం అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయ కర్త వట్టె జానయ్య యాదవ్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు ఈ నెల 14 వ తేదీన వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం ఇచ్చిందని, ఆ రోజు అన్ని ఆధారాలు సిట్ కు తెలియజేస్తానని అన్నారు.
బీసీ నాయకుల ఎదుగుదలను జగదీష్ రెడ్డి జీర్ణించుకోలేదని అందుకే తనని అణచివేయడానికి 60 కి పైగా అక్రమ కేసులు పెట్టి, తన ఫోన్, అనుచరుల ఫోన్లన్నీ జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయించి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల ముందు తనతో పాటు అనుచరులను అడుగడుగున వెంబడించి తన వెంట రానీయకుండా అజ్ఞాతంలో ఉండేలా తీవ్ర ఇబ్బందులు మానసిక క్షోభకు గురి చేశాడని ఆక్షేపించారు.
జగదీష్ రెడ్డికి శిక్ష పడేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి పేరుతో అడ్డగోలు దోపిడీకి జగదీష్ రెడ్డి పాల్పడ్డాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్, కుంభం నాగరాజు, వల్లాల సైదులు యాదవ్,కుంభం వెంకన్న, మీర్ అక్బర్, సుంకర బోయిన రాజు, బొల్లె సైదులు, పెద్దబోయిన జానకి రాములు, ఆవుల అంజయ్య యాదవ్, సూపర్ సైదులు, ఉప్పల మల్లయ్య కడంపెర్ల చంద్రయ్య, లింగాల సైదులు,
ముక్కాల లింగయ్య, వట్యాల శేఖర్, ఉపేందర్, చింతకాయల జానయ్య, వల్లాల బుచ్చయ్య యాదవ్,ఆవుదొడ్డి శ్రీకాంత్,చింత సైదులు, గుంటూరు విజయ్, వట్టె లింగరాజు యాదవ్, ఉప్పునూతల కోటేష్, ఉప్పల మల్లయ్య, దాసరి కిరణ్, బంగారి అనిల్, మంద లింగరాజు, ఒరే కవిత, దాసరి నగేష్, పవన్, గణేష్,ఏర్పుల రాజు, మహేష్, సుమన్, జడల నాగరాజ్, ధరావత్ రాజు, మాలోత్ నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
New Ration Cards : ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ధరఖాస్తుదారులకు రేషన్ కార్డులు ఎప్పుడు..!
-
Minister Komatireddy : ఆర్టీసి బస్సు నడిపిన మంత్రి కోమటిరెడ్జి వెంకట్ రెడ్డి..!.
-
TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
-
Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!









