New Ration Cards : ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ధరఖాస్తుదారులకు రేషన్ కార్డులు ఎప్పుడు..!
New Ration Cards : ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ధరఖాస్తుదారులకు రేషన్ కార్డులు ఎప్పుడు..!
గోదావరిఖని, మన సాక్షి :
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్ల కు చెందిన ప్రజలు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి లో నిర్వహించిన ప్రజాపాలన మరియు మీ సేవ కేంద్రాల ద్వారా 11వేల మంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు కేవలం 14 వందల మంది కి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ప్రకటించారు.
ఇంకా 9600 మందికి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం, పౌరసరఫరాల మరియు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఒక ప్రకటన లో డిమాండ్ చేసారు.
గతంలో నగర పాలక సంస్థ అధికారులు ప్రజాపాలన పేరుతో హడావిడి చేస్తూ నాన హంగామా సృష్టిస్తూ రేషన్ కార్డులు ఒకటే రోజులో ఇచ్చినట్టు చేసారని ఆయన ఏద్దెవా చేసారు. ప్రజలను నగరంలో ఉన్న పేద ప్రజలు రేషన్ కార్డులు లేక అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాపాలన లో అందించిన 7749 దరఖాస్తు ల డాటా ఎంట్రీ ప్రభుత్వ ప్రత్యేక యాప్ లో అఫ్ లోడ్ చేసి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు ఎందుకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ సేవ కేంద్రాల ద్వారా 3400 దరఖాస్తు చేసుకుంటే 14వందల మంది కి ఇవ్వడం జరిగిందని రెవెన్యూ అధికారులు ప్రకటన చేయడం విచిత్రంగా ఉంది.
మొత్తం దరఖాస్తు లను విచారణ జరపడం లో రెవెన్యూ, మున్సిపల్, పౌరసరఫరాల, అధికారులు వైఫల్యం వల్లే అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు కాలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ఉన్న పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ఆయన ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
ఇక ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని, ఈ ప్రాంతం అంత అభివృద్ది జరుగుతుందని తెల్లారి లేవగానే ఊదరకొట్టె ఉపన్యాసాలు తప్ప ఈ ప్రాంత ప్రజలకు చేసేది ఏమి లేదని ఆయన విమర్శించారు
MOST READ :
-
Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ దందా.. కేతేపల్లిలో వెలుగులోకి..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
-
Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!









