District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మేస్త్రి, సెంట్రింగ్ చార్జీల ఖరారు.. అధికంగా వసూలు చేస్తే చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మేస్త్రి, సెంట్రింగ్ చార్జీల ఖరారు.. అధికంగా వసూలు చేస్తే చర్యలు..!
పెద్దపల్లి, (ధర్మారం), మన సాక్షి,
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మేస్త్రి & సెంట్రింగ్ చార్జీలు 400 చదరపు అడుగుల ఇంటికి 1,55,000 రూపాయలు, 600 చదరపు గజాల ఇంటి నిర్మాణానికి 2 లక్షల 20 వేల రూపాయలను ఖరారు చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేదలకు భారం కాకుండా ఇటీవల ఇటుక బట్టీల యాజమాన్యులతో చర్చించి అవసరమైన 12 వేల ఇటుకలను ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసల చొప్పున సరఫరా చేసేందుకు ఒప్పించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు.
అదే విధంగా గ్రామాలలో పర్యటన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిర్ణీత చార్జీ కంటే మేస్త్రి చార్జీలు అధిక మొత్తంలో తీసుకుంటున్నారని తెలుసుకున్నామని అన్నారు. మన పెద్దపల్లి జిల్లాలో మేస్త్రి సెంట్రింగ్ చార్జీలు 400 చదరపు అడుగుల ఇంటికి 1,55,000 రూపాయలు, 600 చదరపు గజాల ఇంటి నిర్మాణానికి 2 లక్షల 20 వేల రూపాయలను ఖరారు చేస్తున్నట్లు, దీనిపై ప్రతి మండలంలో సంబంధిత తహసిల్దార్ అధ్యక్షతన ఎంపీడీవో స్టేషన్ హోదా అధికారి మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.
నిర్ణీత చార్జీల కంటే అధికంగా మేస్త్రి సెంట్రింగ్ చార్జీలు వసూలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గాను ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇంటి నిర్మాణానికి ఒక్కో ట్రాక్టర్ ఇసుక కూలి & రవాణా చార్జీలు పెద్దపల్లి మండలంలో 1200, సుల్తానాబాద్ మండలంలో 900 , ఓదెల, శ్రీరాంపూర్ అంతర్గాం మండలాల్లో 1000, జూలపల్లి మండలంలో 1500 రూపాయలు, పాలకుర్తి, ధర్మారం మండలా లో 2200 , రామగుండం మండలంలో 2300, మంథని మండలంలో 1400 , కమాన్ పూర్, రామగిరి మండలాల్లో 2100 రూపాయలుగా నిర్ధారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
పేదలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు జిల్లా యంత్ర అన్నం తరపున పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నామని లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!
-
Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!
-
Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!
-
Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!









