Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేసింది.

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేసింది. గత ఏడాది జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న రైతుబంధు పథకంలో మార్పులు చేస్తూ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
గతంలో ఎకరానికి రెండు విడతలుగా 10,000 రూపాయలను ప్రభుత్వం అందించగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి 15 వేల రూపాయలను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ తెలిసిందే. కాగా గత ఏడాది ప్రారంభించిన రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రెండు విడతలుగా 12 వేల రూపాయలను అందజేస్తున్నారు.
వానాకాలం సీజన్ లో పంటల సాగుకు ముందే రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరువేల రూపాయలు చొప్పున జమ చేశారు. ప్రస్తుతం ఈ పథకంలో కీలక మార్పులు చేశారు. నిజమైన పంటలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. దాంతో ప్రభుత్వ నిధులు దుబారా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో శాటిలైట్ ఆధారంగా పంటలు సాగు చేసిన వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయం అందించనున్నారు. గతంలో మాదిరిగా బీడు భూములకు, గుట్టలు, రాళ్లు ఉన్న భూములకు కూడా పంట పెట్టుబడి సహాయం అందజేయకుండా ఈ యాసంగి సీజన్ నుంచి శాటిలైట్ సర్వే ఆధారంగా రైతులకు రైతు భరోసా పథకం అందించనున్నారు.
వివరాల సేకరణ మొత్తం.. సంక్రాంతి పండుగ వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని రైతుల ఖాతాలలో నిధులు జమ చేయనున్నారు. మార్చి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతులందరికీ రైతు భరోసా పథకం అందించే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ద్వారా 10 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం యాసంగి సీజన్ లో అందే అవకాశాలు ఉన్నాయి.
MOST READ
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!
-
Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!
-
WhatsApp : వాట్సాప్లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!
-
Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!









