TGSPDCL : టీజీఎస్పీడీసీఎల్ సంచలన నిర్ణయం.. కరెంట్ బిల్లులు అలా చెల్లిస్తే చెల్లవు.. ఇకపై ఇలా చెల్లించాలి..!
TGSPDCL : టీజీఎస్పీడీసీఎల్ సంచలన నిర్ణయం.. కరెంట్ బిల్లులు అలా చెల్లిస్తే చెల్లవు.. ఇకపై ఇలా చెల్లించాలి..!
హైదరాబాద్, మన సాక్షి :
విద్యుత్ బిల్లుల చెల్లింపులో టీజీ ఎస్పీడీసీఎల్ (TGSPDCL) సంచలన ప్రకటన జారీ చేసింది. ఇకపై కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలో తెలియజేసింది. గతంలో మాదిరిగా ఫోన్ పే, గూగుల్ పే, పేటియం, అమెజాన్ పే లాంటి యాప్ లో కరెంటు బిల్లు చెల్లిస్తే అంగీకరించబడదని తెలియజేసింది.
ఇప్పటివరకు విద్యుత్ వినియోగదారులంతా నెల నెలా విద్యుత్ కార్యాలయాలలో బిల్లులు చెల్లించడం కంటే యూపీఐ యాప్స్ ద్వారానే ఎక్కువగా చెల్లిస్తున్నారు. కానీ టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) సంచలన నిర్ణయం తీసుకుంది. అలా యూపీఐ ద్వారా చెల్లించే విద్యుత్ బిల్లులు అంగీకరించబడవని తెలియజేసింది.
ALSO READ : Rythu Bharosa : రైతు భరోసాకు పరిమితులు విధించాలి.. అభిప్రాయ సేకరణలో రైతుల వెల్లడి.!
ఆర్బిఐ (RBI) నిబంధనల ప్రకారం కరెంటు బిల్లులు ఫోన్ పే, పేటియం, గూగుల్ పే, అమెజాన్ పే మరియు బ్యాంకుల ద్వారా చెల్లించిన కరెంట్ బిల్లులను టిజిఎస్పీడీసీఎల్ (TGSPDCL) అంగీకరించబడదని తెలియజేసింది. 2024 జూలై 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నది. వినియోగదారులంతా టీజీ ఎస్పీడీసీఎల్ (TGSPDCL) అధికారిక వెబ్సైట్ గాని మొబైల్ యాప్ ద్వారా గాని మాత్రమే ప్రతినెల కరెంటు బిల్లులు చెల్లించాలని పేర్కొన్నది.
ALSO READ :
Viral : ఒకే ఇంటికి మూడోసారి చోరీకి వెళ్ళిన దొంగ.. బెడ్ రూమ్ లో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు ఇలా..!









