District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తా..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తా..!
నల్లగొండ, మన సాక్షి:
ఇక పై జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ను అమలు చేస్తామని, వార్డెన్లు ఫేస్ రికగ్నెన్షన్ యాప్ లో రానట్లయితే అలాంటి వారి జీతాన్ని నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.
ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైతే సంబంధిత ఉద్యోగులను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ఆమె ఉదయాదిత్య భవన్ లో అన్ని సంక్షేమ శాఖల అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.
హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా వార్డెన్లు వారిని సొంత పిల్లలుగా చూడాలని , ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పేద పిల్లలే ఉంటారని, ధనవంతుల పిల్లలైన పేద పిల్లలైనా ఒకటే అనే భావనతో సంక్షేమ వసతి గృహాల అధికారుల పనిచేయాలని, వార్డెన్లు తప్పనిసరిగా జాబ్ చార్ట్ పాటించాలని హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు హాస్టల్ లో ఉండాలని, కార్య స్థానాలలో నివసించాలని, తప్పనిసరిగా మెనూ పాటించాలని, సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్లు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కేజీబీవీ పాఠశాలలను, కళాశాలలను తనిఖీ చేయాలని, అన్ని హాస్టళ్లు, కేజీబీవీ లలో స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలని, ఇకపై హాస్టల్లల్లో ఫేస్ రికగ్నిషన్ పద్ధతిని అమలు చేయడం జరుగుతుందని, ఎవరైనా ఫేస్ రికగ్నిషన్ యాప్ లో అందుబాటులో లేకుంటే తప్పనిసరిగా వారి జీవితాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు.
గ్రామపంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని అన్ని హాస్టళ్లను సందర్శించి పారిశుధ్యలోపం లేకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని హాస్టల్లో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని ,ప్రతి కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూలు, హాస్టళ్లల్లో ఏఎన్ఎంలు తప్పనిసరిగా జాబ్ చార్ట్ నిర్వహించాలని, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, డ్రైనేజీ సమస్య రాకుండా సోక్ పిట్లు నిర్మించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితులలో పర్యవేక్షణ లోపం ఉండ రాదని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్హాజరు కావద్దని, జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అయితే సంబంధిత హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపల్ లు , సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ల పై కఠిన చర్యలుతీసుకుంటామని ,అవసరమైతే ఉద్యోగం నుండి తొలగిస్తామని హెచ్చరించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, శ్రీదేవి ,రమణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, డీఈవో బిక్షపతి ,ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
MOST READ :
-
Suryapet : నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్ ఘటన.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!
-
Musi : మూసి ప్రాజెక్టుకు భారీ వరద.. కుడి కాలువకు నీటి విడుదల..!
-
Miryalaguda : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..!
-
Miryalaguda : ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ కీలక ప్రకటన.. మిర్యాలగూడలో ఇకపై వారంలో రెండు రోజులు ప్రజా వాణి..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య..!









