Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్ ఘటన.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!

Suryapet : నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్ ఘటన.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!

మేళ్లచెరువు, మనసాక్షి :

నీళ్ల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కిన ఘటనలో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళి పై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి స్కూల్ ను తనిఖీ చేసి స్టూడెంట్లతో మాట్లాడిన అనంతరం నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రిన్సిపాల్ మురళిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

స్కూల్ లోని సమస్యలపై ఆమె స్టూడెంట్స్ తో ముఖాముఖి అడిగి తెల్సుకున్నారు.మౌలిక వసతులలో కల్పనలో నిర్లక్ష్యంపై అనేకసార్లు ప్రిన్సిపాల్ కు వివరించినా పట్టించుకోలేదని స్టూడెంట్లు ఆరోపించారు.భవన యజమానిని పిలిచి మాట్లాడారు.

మిషన్ భగీదర ద్వారా నీళ్లందించే పైప్ లైన్ ఎస్టిమేషన్ వేసి వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారని ఆమె వెల్లడించారు.స్టూడెంట్లకు స్పోర్ట్స్ మెటీరియల్ ను అందజేశారు‌. ఆమె వెంట ఆర్సీఓ బలరాం, వైస్ ప్రిన్సిపాల్ మురళీధర్, నటరాజ్, రవికుమార్, కాంతారాజు తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!

  2. District collector : అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థినులు.. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్..!

  3. District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!

  4. Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

మరిన్ని వార్తలు