Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

జగిత్యాల, (మన సాక్షి):

కొడుకులు, కోడళ్లు తనను పోషించక పోగా ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన తులసి వెంకటవ్వ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను ఆశ్రయించింది.

ఆయన సాయంతో ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేసింది. కొడుకులు విదేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తున్నా తనకు తిండి పెట్టక కొట్టి ఇంట్లోంచి వెళ్ల గొట్టిన కొడుకులు జగన్, మహేష్, కోడళ్లు గంగ, గౌతమిలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, లేని తీరుకు జైలు శిక్ష, జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు కొడుకులు, కోడళ్లపై వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి),సెక్షన్ 4(1),సెక్షన్ 24 ప్రకారం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని వృద్ధుల చట్టం అసిస్టెంట్ పద్మజ ను ఆదేశించారు.

ఆ వృద్ద్దురాలి వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కౌన్సెలింగ్ అధికారి పి.సి.హన్మంత రెడ్డి ,ప్రతినిధులు వెల్ముల ప్రకాష్ రావు, దిండిగాల విఠల్, సత్యనారాయణ, తదితరులున్నారు.

MOST READ : 

  1. Diabetes : పరీక్షలు లేకుండానే మీ శరీరంలో షుగర్ తెలుసుకోవచ్చు..!
  2. FOOD : గడువు దాటిన తినుబండారాలు విక్రయం..!
  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!
  4. Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!
  5. PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు