Shadnagar : కలుషిత వ్యర్థాలతో చేపలు మృత్యువాత.. భారీ నష్టం
Shadnagar : కలుషిత వ్యర్థాలతో చేపలు మృత్యువాత.. భారీ నష్టం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని చటాన్ పల్లి మున్సిపాలిటీ సమీపంలో నెలకొల్పిన ప్రయాగ్ కన్స్యూమర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యర్థాలు చెరువు నీటిలో కలుషితమై చేపలు మృత్యువాత పడ్డాయి.
దీంతో మత్స్యకారులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు మద్దతుగా ముదిరాజ్ సంఘం నాయకులు సదరు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. మత్స్యకారులకు న్యాయం చేసి కంపెనీ వదిలిన వ్యర్ధాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చటాన్ పల్లి సమీపంలో ఉన్న ప్రయాగ్ కన్స్యూమర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చాక్లెట్ మిఠాయి పరిశ్రమ నుండి వెలువడే కెమికల్, వ్యర్థాలు, విష వాయువులు పక్కనే ఉన్న గ్రామానికి చెందిన సురముని సముద్రం చెరువులో కలిశాయి.
దీంతో భారీ స్థాయిలో చేపలు మృతి చెందాయని మత్స్యకారుల సంఘం నేతలు ఆరోపిస్తూ. చాక్లెట్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. సురమోని సముద్రం చెరువులో భారీ స్థాయిలో కుప్పలు తెప్పలుగా సోమవారం చేపలు మృత్యు వాత వాతపడ్డాయి.
దీనికి ప్రధాన కారణం పక్కన ఉన్న చాక్లెట్ పరిశ్రమ నుండి వెలువడే వ్యర్ధాలు కావడంతో ముదిరాజ్ సంఘం నాయకులు కంపెనీ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. విషవాయులు కలిసిన నీరు చెరువులోకి చేరడంతోనే పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయనీ అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వ్యర్థాల వల్లే చేపలు చనిపోయాయని మత్య కారులు సంఘం నేత అంచె రాములు ఆరోపించారు.
దీంతో మత్స్యకారులు చేపలతోనే జీవనోపాధి కోల్పోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల మృతికి కారణమైన పరిశ్రమ యజమాన్యం నష్ట పరిహారం చెల్లించాలని, అదేవిధంగా కంపెనీ నుండి విడుదలవుతున్న ప్రమాదకర రసాయనాలను నిషేధించాలని మత్య కారులు సంఘం నేత రాములు డిమాండ్ చేశారు.
సురముని సముద్రం చెరువులో మత్స్యకారులు ఏడాది ఐదు లక్షల చేప పిల్లలను ఇందులో వదిలినట్టు తెలిపారు. అయితే చేపలు పెద్ద సైజులో మారాయని ఇప్పుడు అవి కూడా మృతి చెందాయని, చేపలతో జీవనం చేస్తున్న తమకు భారీ నష్టం సంభవించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పగా కంపెనీ యజమాని అందుబాటులో లేరని అందులో పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు సమాధానం చెప్పారు. మూడు రోజులు గడువు ఇస్తే యజమాని రాగానే నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ ధర్నాలు విరమించినట్టు ప్రకటించారు.
LATEST NEWS :
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
Good News : షెడ్యూల్ తెగలకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం చేయూత..!









