ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం.. మాట నిలుపుకొని దివ్యాంగురాలుకు ఉద్యోగం..!
ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం.. మాట నిలుపుకొని దివ్యాంగురాలుకు ఉద్యోగం..!
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినట్లుగా ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో భారీ జన సందోహం మధ్య రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భాగంగా ఆరు గ్యారెంటీ ల ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు.
ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!
6 గ్యారంటీ లపై సంతకం :
ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలపై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. వాటి విధివిధానాల ఆధారంగా 100 రోజులలో అమలు చేస్తారని అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.
దివ్యాంగురాలైన రజినికి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు వెంటనే ఉద్యోగం ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు.










