Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్..!

Nalgonda : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్..!

75 కింటాల్ పీడీఎస్ బియ్యం,

రవాణా చేయుటకు ఉపయోగిస్తున్న ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం

మహీంద్రా బొలరో ట్రాలీ వాహనం స్వాధీనం.

నల్లగొండ, మనసాక్షి :

ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ  హెచ్చరించారు. మంగళవారం రోజు జిల్లా యస్.పి గారి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం నాంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో మెల్లవాయి గ్రామం వద్ద ఉన్న మల్లికార్జున రైస్ మిల్లు వద్దకు చేరుకుని తనిఖీ చేయగా అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో మహీంద్రా బొలెరో ట్రాలీ లోడ్ లో 75 కింటాల్ పీడీఎస్ బియ్యం బస్తాలు అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నాయి.

దానిపై రైస్ మిల్లు యజమానిని విచారించగా, వీరమల్ల మల్లికార్జున్ .వీరమల్ల రమేష్ , నాంపల్లి. వీరు మండల గ్రామస్తుల నుండి చౌక ధరలకు పిడిఎస్ బియ్యాన్ని సేకరించి ట్రాలీ ద్వారా కల్వకుర్తి నాగర్ కర్నూల్‌లోని పౌల్ట్రీ ఫారాలకు విక్రయిస్తున్నారు అని తెలపగా వీరితో పాటు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు డ్రైవర్ల పైన కేసు నమోదు చేసి 75 కింటాల్ పీడీఎస్ బియ్యం ను స్వాధీనం చేసుకోవడం జరిగింది తెలిపారు.

ALSO READ : Miryalaguda : మిర్యాలగూడ రూరల్ ఎస్సైపై విచారణ.. బదిలీ వేటు..!

ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలైన గంజా,జూదం బెట్టింగ్,అక్రమ పీడీఎస్ రైస్ రవాణా, లాంటి వాటిని అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు.

పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ లాంటి నేరాలు అలవాటుగా చేస్తున్న వారి పై పిడిఆక్ట్ చట్టం నమోదు చేస్తామని అన్నారు.అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడం కోసం పోలీసు శాఖ నిరంతరం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని అన్నారు.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

మరిన్ని వార్తలు