తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు యాప్ ద్వార పరిష్కరం.. జిల్లా కలెక్టర్..!

District collector : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు యాప్ ద్వార పరిష్కరం.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సమీక్ష జరిపారు.

ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ రెగులలైజేషన్ స్కీం) దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా ఎక్కువ పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల వివరాలను పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.

డజన్ల సంఖ్యలో దరఖాస్తులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని ప్రశ్నించారు. వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రెగ్యులరైజేషన్ దరఖాస్తును యాప్ ద్వారా పరిష్కరించే అంశంపై అధికారులతో చర్చించారు. రెగ్యులరైజేషన్ కోసం యాప్ లో ఉన్న ఎంపికలను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆమె సూచించారు.

ఎంపీఓ లు పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని రెగ్యులరైజేషన్ దరఖాస్తులకు పరిష్కారం చూపాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిలిపి వేయాలని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, ఎంపిడిఓ పావని, ఎంపివోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు