Breaking Newsఆరోగ్యంతెలంగాణవైద్యంహైదరాబాద్

Virus : చైనాలో వైరస్ వ్యాప్తి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

Virus : చైనాలో వైరస్ వ్యాప్తి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

చైనాలో హ్యూమన్ మెటానియో వైరస్ (హెచ్ఎంపివి) వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. చైనాలో వ్యాప్తి చెందుతున్న వైరస్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నది.

జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఇప్పటివరకు ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు లేవని ఒకవేళ బయట పడితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాదులో ఫీవర్, గాంధీ, ఉస్మానియా, రామకోటి ప్రధాన ఆస్పత్రులతో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

అయితే హెచ్ఎంటీవీ విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, పుష్కలంగా నీరు తాగడంతో పాటు పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండాలని సూచించింది.

ఎవరిని కలవద్దని, పుష్కలంగా నిద్రపోవాలని, మాస్కులు ధరించాలని, ఇతరులతో షేక్ హ్యాండ్ ఇవ్వద్దని సూచించింది. అనారోగ్యంతో ఉన్నవారితో సన్నిహితంగా మెలగొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదని ప్రభుత్వం సూచించింది.

MOST READ : 

మరిన్ని వార్తలు