Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsfoodఆరోగ్యం

Sprouts : మొలకలు తినడం మంచిదేనా.. ఎవరు తినకూడదు, ఏ సమయంలో తింటే మంచిది..!

మొలకలు తినడం ఆరోగ్యానికి, శక్తికి చాలా మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంలో తీసుకోవడం వల్ల రోజంతా శక్తి అందుతుంది.

Sprouts : మొలకలు తినడం మంచిదేనా.. ఎవరు తినకూడదు, ఏ సమయంలో తింటే మంచిది..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మొలకలు తినడం ఆరోగ్యానికి, శక్తికి చాలా మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంలో తీసుకోవడం వల్ల రోజంతా శక్తి అందుతుంది. మొలకలు తినడానికి ఉత్తమ సమయం.. ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు తినవచ్చును. రాత్రిపూట జీర్ణం కావడం కష్టం కాబట్టి సాయంత్రం ఏడు గంటల లోపు తీసుకోవడం మంచిది.

పాటించాల్సిన నియమాలు :

మొలకలు తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలలో.. ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ సమయంలో తినడం వల్ల ప్రోటీన్లు, పోషకాలు బాగా అందుతాయి.

రుచి కోసం :

మొలకలు రుచికరంగా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది. మొలకలను ప్రతి ఒక్కరు తినవచ్చును కానీ గ్యాస్ లేదా అసిడిటీ సమస్యతో ఉన్నవారు రాత్రిపూట మొలకలను తినకూడదు.

MOST READ : 

మరిన్ని వార్తలు