తెలంగాణBreaking Newsనల్గొండపండుగలు

Chinthapalli : శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం..!

Chinthapalli : శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం..!

చింతపల్లి, మన సాక్షి :

శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిపించేందుకు చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్, గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తుల రాక సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధ గోని కృష్ణ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు దేవాలయ ప్రాంగణంలో సకలం సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవో పేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

ఉదయం 10:30 గంటలకుస్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ కృష్ణ పేర్కొన్నా రు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి స్వామివారికి గ్రామ ప్రజలు తలంబ్రాలు హందివనున్నారు.స్వామివారి కల్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు హాజరై స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దొంతగో ని చిన్న యాదయ్య గౌడ్, ఊకోండియాదగిరి గౌడ్, కాసోజు ప్రేమానంద చారి, మొగతాల గణేష్ గౌడ్, దొంతగోని సురేష్ గౌడ్,పిట్టలమహేష్, జమ్ముల శివ గౌడ్, దొంతగోని గణేష్ గౌడ్, దొంత గోని శివ గౌడ్, కాసుల కిరణ్, గ్రామ పెద్దలు మాజీ ఎంపిటిసి మునుకుంట్ల శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొప్పుల జంగయ్య గౌడ్, మాజీ డైరెక్టర్ దుబ్బాకల మదర్ గౌడ్, దొంతగోని శేఖర్ గౌడ్, పడకంటి రాజు గౌడ్, ముత్యాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. Tonbo : శత్రు దేశాల నుంచి రక్షణ కోసం.. రూ. 175 కోట్లు సేకరించిన టోన్‌బో..!

  2. Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!

  3. మద్యానికి బానిస అయిన భర్త.. డబ్బులు ఇవ్వడంలేదని భార్య హత్య.. నిందితుడు అరెస్టు..!

  4. Miryalaguda : ఎస్పిఆర్ పాఠశాలలో ఘనంగా మెగా బాల విజ్ఞాన వినోదిని..!

మరిన్ని వార్తలు