Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!
Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తోంది. కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు మంగళవారం రాత్రి వరకు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహించడంతో పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ద్వారా 2. 79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాగర్ వైపు ఉరకలేస్తుంది. దాంతో సాగర్ జలాశయంలో 312 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గాను ప్రస్తుతం 144.70 టీఎంసీల నీటినిలువ ఉంది. నాగార్జునసాగర్ లో నీటిమట్టం రోజుకు ఆరడుగుల చొప్పున పెరుగుతుంది.
ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల :
సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఆగస్టు 2వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. ఆగస్టు రెండవ తేదీన శాసనసభ కార్యక్రమాలు ముగిసిన వెంటనే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు సాగర్ చేరుకొని ఎడమ కాలువకు వానాకాలం పంటల సాగుకు విడుదల చేయనున్నారు.









