తెలంగాణBreaking Newsరంగారెడ్డి

మబ్బుల్లో పౌర్ణమి చంద్రుని వలె శ్రీవారి దర్శనం..!

మబ్బుల్లో పౌర్ణమి చంద్రుని వలె శ్రీవారి దర్శనం..!

మేడ్చల్ మల్కాజిగిరి , మన సాక్షి :

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్ స్వామివారిని నేటి శనివారం మబ్బుల్లో పౌర్ణమి చంద్రుని వెలుగు వలే ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.

ఇప్పటివరకు పౌర్ణమి చంద్రుడిని రాత్రిపూట మాత్రమే చూశాము. మొదటిసారిగా పట్టపగలు మబ్బుల్లో చంద్రుని ఆనంద్ బాగ్ ఆలయంలోని మూలవిరాట్ స్వామివారిని చూస్తున్నాము. ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు ఇలాంటి అలంకరణ, ఆలోచన తీరును వర్ణించడం మా వల్ల కావడంలేదని భక్తులు కొనియాడారు.

శనివారం హనుమాన్ విజయోత్సవం కలిసి రావడంతో ఆలయం మొత్తం భక్తులతో పోటెత్తింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ వారు తగు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు